KEY RESEARCH FINDINGS on AHTUs in India
- Only 27% AHTUs are functional in India! (Data from 16 states which responded to this question in the RTI)
- NO standard procedure for notification of AHTUs across states even after 10years of MHA Advisory
- Less than 50% AHTUs were notified (Only 114 AHTUs notified by state governments)
- AHTU membership consists only of law enforcement in all states except Mizoram
- Weak legal standing of AHTUs— No law that provides for mandatory investigation of all anti-trafficking cases by AHTUs
- No state government investment into strengthening the AHTUs and notifying them
- 90% of AHTU officials are on additional duties (Prioritize their other duties over their AHTU duties)
WHY AHTUS ARE BETTER FOR HUMAN TRAFFICKING INVESTIGATIONS
- AHTUs are focused units investigating ONLY human trafficking cases– not other local crimes
- AHTUs are able to conduct investigation across state borders and collect necessary circumstantial evidence to strengthen the prosecution case
- AHTU has expertise of skills, intelligence gathering and understand the nuances of the crime of trafficking
- AHTUs focus on medico-legal aspects of investigation and sound technological knowledge
- AHTUs charge sheets are stronger than local police station IOs as they have the resources of expertise/skills , interest and jurisdiction – they also frequently utilize provisions for supplementary charge sheets to indict all traffickers in the chain
ILFAT (Indian Leadership Forum Against Trafficking) DEMANDS…
- A comprehensive anti-trafficking law in India – for all forms of trafficking which will give recognition to AHTUs
- Establishment of AHTUs in all districts of all states and ALL AHTUS to be notified across the country.
- Investigations of trafficking cases mandatorily to be done by AHTUs – NOT by local police stations
- NGOs and survivors to be included in all AHTUs as per 2010 directive of MHA
- AHTUs to ensure targeted interventions to prosecute traffickers and customers who sexually exploit children
భారతదేశంలోని AHTU లపై ఇటీవల జరిపిన సర్వ్యే లో వెల్లడి అయిన అంశాలు
- భారతదేశంలో 27% AHTU లు మాత్రమే పనిచేస్తున్నాయి!(ఆర్టీఐ దరకాస్తు కు స్పందించిన 16 రాష్ట్రాల నివేదిక) ·
- కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసిన 10 సంవత్సరాల తరువాత కూడా ఏ ఒక్క రాష్ట్రం AHTU ల నోటిఫికేషన్ లో కనీస ప్రామాణిక విధానం పాటించడం లేదు ·
- 50% కంటే తక్కువ AHTU లు మాత్రమే నోటిఫై చేయబడ్డాయి.(114 AHTU లు మాత్రమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫై చేయడం జరిగింది) ·
- అన్ని రాష్ట్రాల్లో AHTU లో సభ్యత్వం చట్టాలు అమలు చేసే అధికారులు మాత్రమే ఉన్నారు ఒక్క మిజోరాం రాష్ట్రం లో తప్ప. ·
- AHTU లు చాలా బలహీనమైన చట్టపరమైన స్థితి కల్గి ఉన్నాయి. ఎందుకు అంటే అన్ని అక్రమ రవాణాకు సంబంధించిన కేసులను AHTU లు తప్పనిసరిగా దర్యాప్తు చేయాలి అని సూచించే చట్టం లేదు.
- మన దేశంలో ఏ రాష్ట్ర పభుత్వం కుడా AHTU లను బలోపేతం చేయడానికి తమ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయించడం లేదు.
- 90.90% AHTU లలో పని చేయడానికి ప్రతేకంగా అధికారులును కేటాయించి నియమించడం లేదు వీరికే ఒక అదనపు విధుల్లో బాగంగా మాత్రమే AHTU లకు వీరిని కేటాయించడం జరుగుతూ ఉంటుంది. (ఈ AHTU సిబ్బంది ఈ విదులు కన్నా వారి ఇతర విధులకు అంటే తమ ఒరిజినల్ పోస్ట్ విధులు కు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది)
“హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు” దర్యాప్తుకు ప్రతేకంగా AHTU అవసరం ఏమిటి?
- AHTU లు ప్రతేకంగా అన్ని రకాల మానవ అక్రమ రవాణా కేసులను మాత్రమే పరిశోధించే కేంద్రీకృత యూనిట్లు – ఇతర స్థానిక నేరాల దర్యాప్తు కోసం కాదు. ·
- AHTU లు రాష్ట్ర సరిహద్దుల్లోను అవసరం అయితే ఇతర రాష్ట్రాల్లోకి కూడా వెళ్లి దర్యాప్తు చేయగలవు. అలాగే ప్రాసిక్యూషన్ కేసును బలోపేతం చేయడానికి అవసరమైన సందర్భోచిత సాక్ష్యాలను సేకరించగలవు.
- AHTU లో వివిధ రకాల నైపుణ్యాలు, అనుభవం కల్గిన సిబ్బంది ఉంటారు…. సమాచార సేకరణ, ఇంటెలిజెన్స్ సేకరణ మరియు అక్రమ రవాణా నేరం యొక్క మూలాలు వాటి లింక్స్, అలాగే త్రాఫ్ఫికెర్ నెట్వర్క్ స్వరూపం సూక్ష్మ నైపుణ్యాలను వారు సులభంగా అర్థం చేసుకోవచ్చు.
- AHTU లు తమ కేసుల దర్యాప్తులలో వైద్య- చట్టపరమైన అంశాల పై కుడా ఎక్కువ దృష్టి సారించి, అదునాతన సాంకేతిక పరిజ్ఞానం కుడా వారు ఉపయోగిస్తారు ·
- స్థానిక పోలీస్ స్టేషన్ IO ల కంటే AHTUలు రూపొందించే చార్జిషీట్లు బలంగా ఉంటాయి. ఎందుకు అంటే AHTU లో పనిచేసే పోలీస్అధికారుల నైపుణ్యం/నైపుణ్యాలు, ఆసక్తి మరియు వారి అధికార పరిధి, వారికీ అందుబాటులో వనరులు ఉన్నందున – వారు తరచుగా అనుబంధ ఛార్జ్ షీట్ల కోసం ఉన్న నిబంధనలను ఉపయోగిస్తూ త్రాఫ్ఫికెర్స్ నెట్వర్క్ లోని ప్రతి దోపిడీ దారులను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రతి సారి అనుబంధ చార్జ్ షీట్లు వేయడానికి వీరికి అవకాశం ఉంది.
ILFAT (Indian Leadership Forum Against Trafficking) డిమాండ్లు….
- దేశంలో సమగ్రమైన అక్రమ రవాణా నిరోధక చట్టం తీసుకొని రావాలి – అన్ని రకాల అక్రమ రవాణాకు సంబంధించిన నేరాలును AHTUలు మాత్రమే విచారించే లా ఉండాలి.
- దేశంలో అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో AHTUల ను ఏర్పాటు చేయాలి అలాగే ప్రతి AHTUను అధికారికంగా పోలీస్ స్టేషన్ హోదా కోసం నోటిఫై చేయాలి.
- అన్ని రకాల అక్రమ రవాణా కేసుల దర్యాప్తు భాద్యతను తప్పనిసరిగా AHTU లచే చేయబడాలి – ఇందులో స్థానిక పోలీసు స్టేషన్ల ప్రమేయం ఉండరాదు.
- మినిస్ట్రీ అఫ్ హోం అఫైర్స్ వారు 2010 లో విడులచేసిన నోటిఫికేషన్ ఆదేశాలు ప్రకారం ఎన్జీఓలు (స్వచ్ఛంద సంస్థలు) మరియు అక్రమ రవాణా భాదితులును ప్రతి AHTU లలో సబ్యులుగా నియమించాలి.
- AHTU లు అక్రమ రవాణాదారులు (ట్రాఫ్ఫికర్స్) మరియు 18 ఏళ్ళ లోపు పిల్లలు ను లైంగికంగా దోపిడీ చేసే కస్టమర్లను కటినంగా శిక్షలు పడేవిధంగా నేర పరిశోధన చేయాలి.
Source: Tafteesh & Sanjog study