సెక్స్ వర్కర్స్ కు కోవిడ్ ఉపశమనం క్రింద మహారాష్ట్ర ప్రభుత్వం గొప్ప ఉపశమనం –
నెలకు రూ 5 వేలు వంతున 3 నెలలు పాటు పంపిణి అలాగే బడికి వెళ్ళే వారి పిల్లలుకు రూ 2,500
దేశంలో మొట్టమొదటి సారిగా కోవిడ్ -19 కాలంలో వ్యభిచారం లో ఉన్న మహిళలకు ఆర్థిక సహాయం అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం, వ్యభిచారం లో ఉన్న గుర్తించిన సెక్స్ వర్కర్స్ కు నెలకు 5,000 రూపాయలు వంతున 3 నెలలు పాటు పంపిణీ చేయబడతాయి ఎటువంటి గుర్తింపు కార్డు కు పట్టుబట్టకుండా ఆర్ధిక సహాయం అందజేస్తారు. అలాగే పాఠశాలకు వెళ్ళే వారి పిల్ల్లుకు అదనంగా 2,500 రూపాయలు వంతున పంపిణీ చేయబడతాయి. దీని కింద, 2020 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 3 నెలల కాలానికి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 51 కోట్ల 18 లక్షల 97 వేల 500 రూపాయలు కేటాయించిడం జరిగింది.
బుద్ధదేవ్ కర్మస్కర్ వి. పశ్చిమ బెంగాల్ మరియు ఇతరులు సుప్రీంకోర్టులో క్రిమినల్ అప్పీల్ నెంబర్ 135/2010 గా కేసు దాఖలు చేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టు నవంబర్ 28, 2020 తీర్పు వెల్లడిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం మహారాష్ట ప్రభుత్వం మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి యశోమతి ఠాకూర్ తక్షణ సున్నితమైన చర్యలు తీసుకోవాలని వివిధ ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. ఈ రోజు ఒక తీర్పు వెలువడింది. దీని ప్రకారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 32 జిల్లాలకు 51 కోట్ల 18 లక్షల 97 వేల 500 నిధులు విడుదల చేయడం జరిగింది.
నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (నాకో) ద్వార ఆ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ లో సెక్స్ వర్కర్స్ గా నమోదు అయిన మహిళలకు నెలకు 5,000 రూపాయలు మరియు గుర్తింపు కార్డు అవసరం లేకుండా పిల్లలు పాఠశాలకు వెళ్ళే మహిళలకు అదనంగా 2,500 రూపాయలు అందిస్తుంది.
ఇందుకోసం ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటి లో జిల్లా పౌర సరఫరా అధికారి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, జిల్లా న్యాయ సేవల అథారిటీ ప్రతినిధి, మహిళా పోలీసు అధికారి (పోలీసు కమిషనర్ / జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నామినేట్ చేస్తారు), నాకో (ఎయిడ్స్ కంట్రోల్) జిల్లా స్థాయి ప్రతినిధి మరియు ఎంపిక చేసిన ఎన్జీఓల ప్రతినిధులు వుంటారు. ఈ కమిటికి జిల్లా మహిళా శిశు అభివృధి అధికారి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. పొడి ఆహార ధాన్యాలు, సెక్స్ వర్కర్స్ కు వారి పిల్లలు కు నగదు సహాయం వంటి ప్రాథమిక సేవలను అందించడానికి తదుపరి చర్యల కోసం జిల్లా వారీగా ఈ కమిటి వివరాలు సేకరించి రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి కమిషనర్‌కు పంపుతారు.
ఈ కార్యక్రం ప్రకారం మహారాష్ట్ర లో 32 జిల్లాల పరిధిలో 30,901 సెక్స్ వర్కర్స్, 6,451 మంది సెక్స్ వర్కర్స్ పిల్లలు లబ్ది పొందుతారు.