ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో షుమారు 90 వేల మంది సెక్స్ వర్కర్లు ఉన్నారని వారంతా  ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్ కంట్రోల్ సొసైటీ  లో రిజిస్టర్ కాబడివున్నారని  తెలియజేసింది. ఇతర అంచనాల ప్రకారం ఈ సంఖ్య లక్జ కు దాటి వుంటాయని. ఈ కరోనా లాక్డౌన్  ఫలితంగా రాష్ట్రంలో సెక్స్ వర్కర్స్  జీవన పరిస్థితులు మరింతగా దిగజారాయని … ఇదే పరిస్థితులు మరి కొన్ని రోజులు కొనసాగితే వారు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదానం పొంచి వుందని ఆంధ్ర ప్రదేశ్  అక్రమ రవాణా భాదితుల ఫోరం “విముక్తి” రాష్ట్ర కన్వినర్ శ్రీమతి హసీనా అందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెసిడెన్షియల్ పాఠశాలల్లో, వివిధ హాస్టల్ లూ  ఉన్న  సెక్స్ వర్కర్స్ పిల్లలు తిరిగి ఇళ్లకు చేరుకొని 6 నెలలు కావస్తుంది,  వీరికి ఆన్‌లైన్ తరగతులు సాధ్యం కాదు ఎందుకంటే వీరికి ఇంటర్నెట్ యాక్సెస్  లేదు.  కోవిడ్ లాక్ డౌన్ ప్రారంభం అయిన ఒకటి రెండు నెలలు  ప్రాథమిక సహాయక చర్యలలో మాత్రమే భాగస్వామ్యం వహించిన  ఎన్జీఓలు  ఇప్పుడు వారు ఏమి చేయలేని పరిస్తుల్లో వున్నారు.

ఇప్పుడు సెక్స్ వర్కర్లు తమ మనుగడ కోసం అధిక వడ్డీకి  రుణాలు తీసుకోవలసి వస్తుంది అని  విముక్తి కో కన్వీనర్ శ్రీమతి మున్నేరుష బేగం  అన్నారు.  “సెక్స్ వర్కర్స్ రోజువారీ కూలీ లాంటి వారు. ఏ రోజు విటులు వస్తే ఆ డబ్బుతో ఆ రోజు జీవనం గడుస్తుంది. ఇప్పుడు ఎటువంటి పని లేక ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న వీరికి  ఏ ప్రభుత్వ సంస్థ వారికి ఉపశమనం కలిగించే విధానాలు కార్యక్రమాలు చేపట్టడం పై ఎలాంటి  దృష్టి పెట్టడం లేదు ”.అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది.

సెక్స్ వర్కర్లు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తూ వున్నారు. “రోజువారీ కూలీ కార్మికులు ఇప్పటికీ కొన్ని సాంఘిక సంక్షేమ పథకాల పరిధిలో ఉన్నారు వాటి ద్వార ఏదో ఒక విధంగా లబ్ది పొందుతూ వున్నారు. కాని ఈ సెక్స్ వర్కర్లకు అలాంటి ఏ ప్రత్యక పధకం లేదు. ఫలితంగా వారు ‘అనధికారిక రంగానికి అనధికారికం’ లాంటివారు” అని హెల్ప్ సంస్థ ప్రతినిధి భాస్కర్ అన్నారు. ఈ సంస్థ గత రెండు దశాబ్దాలుగా సెక్స్ వర్కర్ల పిల్లలతో పనిచేస్తుంది.

గత దశాబ్దంగా కొన్ని స్వచంద సంస్థలు వల్ల చల్ల మంది మహిళలు ఈ సెక్స్ వృతి మానుకొని వివిధ పనులు చేసుకొంటూ హయిగా జేవిస్తూ వున్నారు. కొంతమంది మహిళలు, బాలికలు షాపింగ్ మాల్స్, వివిధ దుకాణాల్లో సేల్స్ గర్ల్స్ గా ఉద్యోగాలు చేపట్టి హుందాగా కొత్త జీవితం సాగిస్తూ వున్నారు.  అయితే ఈ కరోనా మహమ్మారి లాక్ డౌన్ వల్ల కారణంగా వారిలో చాలా మంది నిరుద్యోగులుగా మారారు మరియు వారిలో ఎక్కువ మందిని అక్రమ రవాణాదారులు సంప్రదిస్తూ వున్నారని, వారికీ ముందుగ డబ్బులు ఆశ చూపుతూ వారిని తిరిగి లైంగిక వాణిజ్యంలోకి రప్పించడానికి ఆసక్తి చూపుతున్నారని లైంగిక-అక్రమ రవాణా బాధితుల పునరావాసం కోసం పచ్చిమ గోదావరి జిల్లాలో  పనిచేస్తున్న  ప్రభుత్వేతర సంస్థ (ఎన్జిఓ) NCYS  సంస్థ కార్యదర్శి శ్రీమతి విజయ నిర్మల  అన్నారు.

ఆర్ధిక ఇబ్బందులు తో పాటు మరియు అప్పులు పెరగడం వల్ల ప్రత్యామ్నయం లేక కొందరు మహిళలు తిరిగి ఈ వైశ్య వృతిలోకి  ప్రవేశిస్తారు. అంతేకాకుండా ఈ కరోనా మహమ్మారి సెక్స్ కోసం వచ్చే కస్టమర్లను నిరోధించలేదు అని హెల్ప్ కార్యదర్శి రామమోహన్  తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం, మానవ రోగనిరోధక శక్తి వైరస్ (హెచ్ఐవి) వ్యాప్తి రాష్ట్రం, దేశంలో ఉదృతంగా ఉన్నప్పుడు సెక్స్ వాణిజ్యాన్ని అంతగా ప్రభావితం చేయలేదని  అయన గుర్తు చేస్తూ .. ఇప్పుడు కోవిడ్ వైరస్ పేరిట సెక్స్ వాణిజ్యాన్ని  అప్పడం సాద్యం కాదు అని ఆయన అన్నారు.

మార్చి నెల నుండి వేశ్యాగృహం మూసివేయబడింది, చాలామంది మహిళలు అవసరమైన వస్తువులను కొనడానికి కుడా డబ్బులు లేక కష్టపడుతున్నారు. మొదటి లో స్వచ్ఛంద సంస్థల అందించిన ఆహారం, విరాళాలపై ఆధారపడ్డాము. “మేము ఇప్పుడు పని చేయలేము, కాబట్టి మాకు ఆదాయం లేదు, ఇది భయానకంగా ఉంది” అని “నాజ్మా” చెప్పింది, ఆమె అసలు పేరు ఇవ్వడానికి ఇష్టపడలేదు.

రమణి (పేర్లు మార్చడం జరిగింది) తన సోదరితో కలిసి తన గ్రామంలో నివసించే తన ముగ్గురు పిల్లలకు ఆమె సంపాదన పైనే జీవిస్తూ వున్నారు. ఆమె కేవలం 15 సంవత్సరాల వయసులో 30 సంవత్సరాల క్రితం ప్రేమికుడు చేతిలో మోసపోయి వేశ్యాగృహంకు బలవంతంగా చేర్చబడింది. ఆమెకు డబ్బు అవసరం అయినప్పటికీ, ఈ కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఈ సమయంలో విటుల వద్దకు వెళ్ళాలి అంటే చాల భయం వేస్తుంది. “మేము మా ఆకలి తీర్చుకోవడానికి డబ్బులు కోసం ఈ వృతి లో పని చేయగలిగినప్పటికీ, ప్రజల ప్రాణాలు ఈ వైరస్ వ్యాప్తి వల్ల మరింత  ప్రమాదంలో పడతాయి. మా వల్ల వాళ్ళు, వాళ్ళ వల్ల మేము అలాగా మా ఇద్దరి వల్ల మరి ఎందరికో ఈ వైరస్ వల్ల ప్రభావితమవుతారో అనే భయం వల్లనే మేము మా ఖాతాదారులతో పడుకోవటానికి మేము భయపడతాము” అని రమణి చెప్పింది

ఈ వైరస్ భయం పోయే వరకు “సెక్స్ వర్కర్స్” రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యకంగా ఏదైనా నిధులు సమకూర్చగలిగితే కనీసం  కొంత వరకు వారికి ఆర్థికంగా సహాయపడుతుంది ”అని లక్ష్మి అని వొక భాదితురాలు  అన్నారు. నూటికి 80 %  సెక్స్ వర్కర్స్  తాము సంపాదిస్తున్న మొత్తంలోనే వారి కుటుంబానికి, వారి తోబుట్టువులకు, వారి పిల్లలు మరియు వారి తాతా, మామలకు  వీరే జీవనాధారాలు. వీరికి ఆర్ధికంగా వస్తున్నా ఈ ఇబ్బందులు వల్ల ఆమె కాదు మొత్తం ఆమె పై ఆధారపడి జీవించే మొత్తం  కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది” అని ఆమె అందోళనగా చెప్పారు.

ఇబ్బందులలో వున్న సెక్స్ వర్కర్స్ ను వెంటనే ప్రభుత్వం అదుకోవలిసిన అవసరం ఎంతయినా ఉంది. “ప్రభుత్వం సెక్స్ వర్కర్స్ కు చేయూత వెంటనే నీయకపోతే, ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఇంకా చాలా కష్టపడవలసి ఉంటుంది, ఎందుకంటే కృష్ణ, గుంటూరు, ప్రకాశం మరియు పచ్చమ గోదావరి జిల్లోనే షుమారు 50 వేల మంది సెక్స్ వర్కర్స్ వున్నారు అది ఈ ప్రాంతానికి చేరుకుంటే, ఈ 50 వేల మంది సెక్స్ వర్కర్లు మాత్రమే కాకుండా, మొత్తం ఈ 4 జిల్లాలు కూడా మరింత ప్రమాదంలో ఉంటుంది.