నేడు  ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

సెక్స్ వర్కర్లకు మానసిక ఆరోగ్య సేవలు అందించాలి  …  విముక్తి డిమాండ్ 

కోవిడ్ మహమ్మారి నేపద్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ వల్ల ఉపాది కోల్పోవడమే కాకుండా వివిధ ఆర్ధిక, సామాజిక వత్తిళ్ళ వల్ల సెక్స్ వర్కర్స్  మానసిక రుగ్మతలు  ఎదుర్కొంటున్నారు. వీరికి  ఎలాంటి అసమానతలు చూపకుండా వెంటనే మానసిక ఆరోగ్య సేవలు అందించేందుకు వీలుగా కమ్యూనిటి స్థాయి మానసిక ఆరోగ్య సేవా కార్యక్రమాలు చేపట్టాలని విముక్తి రాష్ట అద్యక్షులు శ్రీమతి మెహరున్నీసా, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పుష్పావతి  రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సెక్స్ వర్కర్స్ …  మానవ అక్రమరవాణా బాధిత మహిళా సమాఖ్య – విముక్తి ఆధ్వర్యంలో  జక్కంపూడి కాలనీ లో  బాధిత మహిళలు తో సమావేశం నిర్వహించారు. శ్రీమతి మెహరున్నీసా ఈ సందర్భంగా మాట్లాడుతూ “కోవిడ్ మహమ్మారి కారణంగా సెక్స్ వర్కర్లు …  మానవ అక్రమరవాణా  నుండి బయటపడిన భాదితులు మాత్రమే భారతదేశంలో ఎక్కువ ఇబ్బందులు గురైనారు. 

సెక్స్ వర్కర్స్ ఓ వైపు తమ ఆదాయ వనరులను పూర్తిగా కోల్పోయారు, మరోవైపు, ప్రభుత్వాలు అందించే వివిధ సంక్షేమ పధకాలు వీరికి చేరలేదు, దీనికి తోడు సమాజంలో వీరిపై ఉన్న వివక్షత కు తోడు వీరు చేసిన  అప్పులు పెరిగి..సరైన ఆహారం, ఆశ్రయం లేక ..  ప్రాథమిక అవసరాల కోసం చేతిలో డబ్బులు లేక మానసిక క్షోభకు గురవుతున్నారు. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. 

నేషనల్ మెంటల్ హెల్త్ మిషన్ ఇటీవల చేసిన  సర్వే ప్రకారం భారతదేశంలో 150 మిలియన్ల మందికి మానసిక ఆరోగ్య సంరక్షణ అవసరమని, 70-92 శాతం మంది చికిత్స పొందలేకపోతున్నారు.ఈ సేవలు  పొందలేని లేదా అందుబాటులో లేని వర్గాల లో  సెక్స్ వర్కర్లు తో పాటు  ఎంతో మంది అట్టడుగు..  వెనుకబడిన తరగతులు కు చెందిన వారు ఉన్నారు.

భాదితుల మానసిక సమస్యలు.. వారి  మానసిక పరిస్థితి పై నిర్వహించిన ఈ సర్వే లో ప్రాణాలతో వ్యభిచారం నుంచి బయటపడిన వారందరూ (100%) ఒంటరితనం, నిస్సహాయత, తిరస్కరణ .. ఆందోళన కు గురవుతున్నారని తేలింది.  87.3% మంది నిస్పృహ (డిస్టిమియా) లో వున్నారని, 12.7% మంది డిప్రెషన్ లో వున్నారని గుర్తించారు. ఇది సాధారణ జనాభా (1.8%) తో పోలిస్తే గణనీయంగా ఎక్కువ స్థాయి లో ఉంది.

ప్రజారోగ్య వ్యవస్థ ద్వారా పునరావాస సేవలు అందకపోవడం  భద్రత, రక్షణ, సామాజిక ఆర్థిక భద్రతపై వారి హక్కులను నిర్ధారించడానికి పంచాయతీలకు  జిల్లా యంత్రాంగానికి విధానాలు లేకపోవడం వల్ల సెక్స్ వర్కర్లు ఇబ్బంది పడుతున్నారు.  వారు తమ గ్రామాలకు తిరిగి వచ్చినప్పుడు  మానసిక ఆరోగ్యo ..  పునరావాస సేవలు అందుకొనే అవకాశాలు లేవు.
 రాష్ట్రము లో .. జిల్లా ..  గ్రామీణ ప్రాంతాల్లో మనస్తత్వవేత్తలు…   మానసిక రోగ వైద్యుల కొరత ఉంది.దీంతో అక్రమ రవాణా నుండి బయటపడి డిస్టిమియా, డిప్రెషన్  రుగ్మతలకు  గురైన వారికి సేవలు అందడం లేదు.

ఈ సమస్య పరిష్కరించడానికి సరైన సేవలు అందించే యంత్రాగం  అవసరం ఉంది.  మానసిక ఆరోగ్య సేవలు లైంగిక దోపిడీ నుండి బయటపడిన వారికి మాత్రమే కాకుండా  అత్యాచారం, గృహ హింస.. లైంగిక వేధింపులకు గురైన వారికి ఉపయోగ పడుతాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.50 లక్షల సెక్స్ వర్కర్స్  ఉన్నారు. వారి ఆరోగ్య భద్రత … శ్రేయస్సుకోసం విముక్తి పోరాటం చేస్తుంది
2021 అక్టోబర్ 10 న ప్రపంచ  మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని భారతదేశం పాటిస్తున్నందున,మన రాష్ట్రంలోని సెక్స్ వర్కర్స్ .. మానవ అక్రమ రవాణా నుండి బయటపడిన వేలాది మంది బాధితుల  ఆరోగ్య సంరక్షణ కోసం ఈ క్రింది సమస్యలు పరిష్కరించామని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.”అన్నారు. 

1. రాష్ట్రం లోని అన్ని  మురికి వాడలు..  అనధికార శ్రామికులు ఉండే ప్రాంతాలు లో ఉన్న కమ్యూనిటీ కోసం మరింత కమ్యూనిటీ ఆధారిత మానసిక ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టాలి.
2. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పిహెచ్‌సిలు.. పట్టణ ఆరోగ్య కేంద్రాల ఆసుపత్రులు … క్లినిక్‌ లలో కౌన్సెలింగ్ .. మానసిక చికిత్స సేవలు అందేలా చూడాలి.
3. మానవ అక్రమ రవాణా నుండి బయటపడినవారి పునరావాసం కోసం మానసిక ఆరోగ్యం .. పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్  పరీక్షలు కుడా చేసేలా చూడాలి.
4. మానవ అక్రమరవాణా భాదితుల ..సెక్స్ వర్కర్స్ మాటలను వినండి, వారిని నమ్మండి, వారికి ఆరోగ్య సేవలు అందేలా చూడండి.