పెరుగుతున్న బాలికల, మహిళల అక్రమరవాణా నిరోధానికి
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో AHTU యూనిట్స్ ఏర్పాటు చేయాలి – విముక్తి డిమాండ్
చిన్నతల్లులకు ఎంత కష్టం వచ్చింది. చెంగు చెంగున లేడి పిల్లల్లా ఎగురుతూ …ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో మానవ మృగాల వేటకు బలవుతున్నారు. బయటకు అడుగు పెడితే చాలు మాటు వేసి కాటు వేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆడపిల్లలు కామాగ్నికి బలవుతున్నారు. ఆడపిల్లల అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా ఆడపిల్లల అక్రమ రవాణా పెరుగుతోంది.
ప్రభుత్వ రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయి. దేశంలో ప్రతి ఏడాది లక్షల్లో పిల్లలు మిస్ అవుతున్నట్లు కేసులు నమోదు అవుతున్నాయి. నమోదు అయ్యే కేసుల్లో వేలల్లోనే కనిపిస్తున్నాయి. ఇందులో అధిక శాతం మైనర్ బాలికలే ఉంటున్నారు. మిస్సింగ్ కేసులలోమహిళలు కూడా ఉంటున్నారు. మిస్సింగ్ కేసులుగా నమోదవుతున్న బాలికలను వేశ్యాగృహాలకు అమ్మివేస్తున్నారు. అక్రమరవాణా కేసులు కూడా అనూహ్యంగా పెరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా మిస్సింగ్ కేసులు బాగానే ఉంటున్నాయి.
మిస్ అయిన అమ్మాయిల్లో కొందరిని ఢిల్లీలోని రెడ్లైట్ ఏరియాలకు అమ్మివేస్తున్నారు. అలాగే మనదేశం నుంచి ఉక్రేయిన్, ఖజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, నేపాల్, థాయిలాండ్, మలేసియా తదితర దేశాలకు తరలి వెళుతున్నారు. అక్కడ వీరంతా బానిసత్వంలో మగ్గిపోతున్నారు. కరవుతో అల్లాడుతున్న బుందేల్ఖండ్, మహారాష్ట్ర, బీహార్, కర్నాటక తదితర రాష్ట్రాలలో చిన్నారి బాలకలను పోషించలేక వందలాది రూపాయలకే అమ్మేసుకున్న ఉదాహరణలున్నాయి.
పోలీసులు పట్టుకుంటున్నపుడు అమ్మాయిల తరలింపు తగ్గుతోంది … ఆ తర్వాత మళ్ళీ మామూలే. కుంటున్నారు. ఆడపిల్ల కాలు బయటకు పెట్టిందంటే ట్రాప్ చేసేందుకు ప్రయత్నించేవాళ్లే ఎక్కువ. అమ్మాయిల అక్రమ రవాణాదారులు సోషల్మీడియానే ఉపయోగించుకుంటూ డబ్బులు ఆర్జిస్తున్నారు. చట్టాలు బలహీనంగా ఉండటం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని విముక్తి రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి మెహరున్నీసా, కో కన్వీనర్ శ్రీమతి బనుప్రియ, రజని అంటున్నారు.
వేలాది కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉండటమే దీనికి నిదర్శనమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలు తో కలుపుకొని మొత్తం ౩౦ రాష్ట్రాలు ఉండగా అందులో 27% AHTUs మాత్రమే చురుకుగా పనిచేస్తున్నాయి. వీటిల్లో 50% కన్నా తక్కువగా AHTUs లకు పోలీసు స్టేషన్ అధికారాలు కల్పిస్తూ నోటిఫై చేయడం జరిగింది. మన రాష్ట్రంలో ఉన్న 3 AHTUs ను కుడా నోటిఫై చేయడం జరగడం లేదు. ప్రస్తుతం దేశం లో ఏర్పాటు చేసిన ఈ AHTUs లో 90.90% ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు మాత్రమే చూసేందుకు ప్రత్యేక అధికారులు లేదా సిబ్బందిని నియమించలేదు. చాలా మంది ఈ AHTUs కు అదనపు భాద్యులు గా మాత్రమే చూస్తూ ఉన్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో AHTUs కమిటీలు కూడా ఏర్పాటు చేయలేదు.
ఏది ఏమైనప్పటికీ 18ఏళ్లు కూడా నిండని అమ్మాయిలు దాదాపు మూడు మిలియన్ల మంది పైగా సెక్స్ వర్కర్లుగా నమోదు కావటం దేశంలోని దౌర్భాగ్య స్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికి అయినా దేశంలో అన్ని జిల్లాల్లో AHTUs త్వరితగతిన ఏర్పాటు చేసి ముక్యంగా మనవ అక్రమ రవాణా పై ద్రుష్టి సారించవలిసిన అవసరం ఎంత అయినా ఉందని అక్రమరవాణా బాధితుల సమాఖ్య “విముక్తి” రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి మెహరున్నీసా, కో కన్వీనర్ శ్రీమతి బనుప్రియ, రజని అంటున్నారు.
We all need to sensible towards this issue and work for the change
Nice presentation. Understood the vision and mission. AHTU, needs to be established and be active in Andhra Pradesh.
We appreciate the efforts made by Vimukti team and HELP.
ప్రతీ రోజూ పేపర్లో
ప్రతీ రోజూ వార్తల్లో
ఎక్కడో ఒక చోట
కనిపించే అమానుషం
వినిపించే ఆర్తనాదం
అన్యాయమయ్యే ఆడతనం
ఏ తల్లికడుపు ఆవేదనో,
ఏ కాముకుడి విషపుక్రోరకో బలియైపోయిన వారి ఆర్తనాదాలు వింటుంటే హృదయం ద్రవించి పోతుంది. వారికి ఏమైనా సహాయం చేయాలని ఉంటుంది. కానీ ఏమి చేయలేక నిస్సహాయతతో బ్రతికేస్తూ ఉండేవాడిని.AHTU యూనిట్స్ వల్ల అటువంటి వారికి ప్రత్యక్షంగా నేనే సహాయం చేయగలరని అన్న విషయం తెలియగానే చాలా ఆనందంగా ఉంది.