వ్యభిచారం నేరం అని సూచించే సెక్షన్ మన దేశంలోని ఏ చట్టం లో పేర్కొనలేదు, అయితే వ్యభిచారం కోసం ఇతరులను ప్రేరింపచేయడం లేదా ప్రస్తహించడం అలాగే వేశ్యాగృహం నడపడం మాత్రం చట్టవిరుద్ధం.
చట్టం ప్రకారం వ్యభిచారం క్రిమినల్ నేరం కాదని, వయోజన మహిళకు తన వృత్తిని ఎంచుకునే హక్కు ఉందని వారి ఇష్టానికి వ్యతిరేకంగా సంస్కరణలు / దిద్దుబాటు కోసం హొమెస్ లో నిర్భందించడం సబబు కాదని బొంబాయి హైకోర్టు పేర్కొంటూ.. వ్యభిచారం కేసుల్లో రిస్కు చేసి సంస్కరణలు / దిద్దుబాటు కోసం ముంబై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఓ హోమ్ లో ఉంచిన ముగ్గురు మహిళా సెక్స్ వర్కర్లను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఒక గెస్ట్ హౌస్ పై దాడి చేసి అనంతరం అందులో పట్టుబడ్డ 20 ఏళ్ళ వయస్సు కల్గిన ముగ్గురు మహిళలును ప్రబుత్వ హోమ్ లో చేర్పించి, మధ్యవర్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తదనంతరం, ముగ్గురు మహిళల తల్లులు మరియు వారి చట్టపరమైన సంరక్షకులు భాదిత మహిళలను తమ కస్టడీ కోరుతూ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. అయితే, వారి తల్లులు కు మరియు వారి సంరక్షకులకు వారిని ఓప్పగించడానికి మేజిస్ట్రేట్ నిరాకరించారు. ముంబాయి హైకోర్ట్ న్యాముర్తి జస్టిస్ చవాన్ ఈ కేసు విచారిస్తూ అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం -1956 ప్రకారం మూడు వారాల వ్యవధికి మించి బాధితులను అదుపులో ఉంచడానికి మేజిస్ట్రేట్కు అధికారం లేదని అన్నారు. మహిళలు … “పెద్దలు” మరియు “స్వేచ్ఛగా” వెళ్లడానికి మరియు వారి స్వంత వృత్తిని ఎన్నుకునే వారి ప్రాథమిక హక్కుకు అర్హులు అని ఆయన అన్నారు. ఈ మహిళలపై చట్టం ప్రకారం విచారణ జరగనందున, దిద్దుబాటు గృహంలో వారి నిర్బంధాన్ని కొనసాగించే ప్రశ్న లేదని హైకోర్టు అభిప్రాయపడింది. “ఈ చట్టం ప్రకారం శిక్షార్హమైనది ఏమిటంటే లైంగిక దోపిడీ లేదా వాణిజ్య ప్రయోజనం కోసం ఒక వ్యక్తిని లైంగిక దోపిడీ చేయడం మరియు తద్వారా సంపాదించడం నేరం. అలాగే ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశంలో వ్యభిచారం చేస్తున్నప్పుడు లేదా ఒక వ్యక్తి చట్టం ప్రకారం నిర్వచించిన విధంగా మరొక వ్యక్తిని అభ్యర్థించడం లేదా మోహింపజేయడం కనుగొనబడినప్పుడు, అది కూడా నేరంగా భావించవచ్చు“ అని కోర్టు తెలిపింది.
Source: PTI /The Hindu