అక్రమ రవాణా బిల్ 2021 – మంచి, చెడు… సందేహాలు
మంచి అంశాలు!
- కేవలం సెక్స్ ట్రాఫికింగ్ మాత్రమే కాక, అన్ని రకాల మానవ అక్రమ తరలింపులు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.
- బాధితులందరి కోసం బాధితుల నష్ట పరిహారం.
- బాధితులందరి కోసం పునరావాసం.
- పునరావాసం అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచనం చెబుతూ చట్టం. బాధ్యతలను నిర్దుష్టమైన పద్దతిలో కేటాయించాలి.
- బాధితుల ఇష్టానికి విరుద్ధంగా బాధితులను బలవంతంగా శరణాలయాల్లో ఉంచరాదు.
- లీగల్ కేస్ విచారణా ప్రక్రియలు లేదా ఫలితాల మీద నష్ట పరిహారం మరియు పునరావాసం ఆధారపడరాదు.
- అక్రమంగా తరలించబడిన పరిస్థితుల నుంచి కాపాడబడుతున్న మరియు తమ గ్రామాలకు లేదా కుటుంబాలకు ఇళ్ళకు తిరిగి వెళుతున్న పీడితులకు, పునరావాస సేవలను ప్రత్యేకించి వారు తమ కాళ్ళపై తాము నిలవగలిగే ఆర్ధిక సహకారాన్ని అందించే సేవలను పొందగలిగేందుకు అనువుగా లింకేజ్ (అనుబంధాన్ని) స్థిరపరుచుకునేందుకు సహాయపడాలి.
- అంతర్ రాష్ట్ర దర్యాప్తులను నిర్వహించేందుకు అవసరమైన నిధులకు గాను మరియు ఇతర లాజిస్టిక్ పరమైన సహకారానికి ఏర్పాట్లు చేయాలి. దర్యాప్తులను నిర్వహించేందుకు మొదలైనవాటి కోసం, ఒక జాతీయ దర్యాప్తు ఏజెన్సీ, మానవ అక్రమ రవాణాను నిలుపు చేసే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ఏర్పాటు చేయాలి.
- ట్రాఫికర్లకు (అక్రమ తరలింపుకు పాల్పడేవారికి) శిక్ష తక్షణం మరియు కఠినంగా విధించటం.
- తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించని విధి నిర్వాహకులను లేదా పీడితులను వేధించే వ్యక్తులను తప్పకుండా శిక్షించాలి.
- నేరాన్ని నిరూపించవలసిన బాధ్యత పీడితునిది కాదు.
తప్పిపోయిన అంశాలు :
1. పీడితుని నష్ట పరిహారం కోసం నిధి
2. పునరావాసానికి నిధి
3. పునరావాసం అంటే ఏమిటో చట్టం స్పష్టంగా చెప్పి, నిర్దుష్టమైన బాధ్యతలను కేటాయించాలి.
4. శరణాలయాలకు వెలుపల పునరావాసం ఏర్పాటు చేయాలి.
5. శరణాలయాల్లో భాదితులను ఉంచే సమయం / పరిధి తగ్గించాలి
6. అంతర్ రాష్ట్ర దర్యాప్తులను నిర్వహించేందుకు మరియు ఇతర లాజిస్టిక్ పరమైన సహకారాన్ని సమకూర్చుకునేందుకు అవసరమైన నిధులను ఏర్పాటు చేయాలి.
7. దర్యాప్తులను నిర్వహించేందుకు మొదలైనవాటి కోసం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU)
8. ఈ చట్టాన్ని అమలు చేసేటప్పుడు, అన్ని సంబంధిత విధానాలను తయారు చేసేటప్పుడు సందర్భంలో, పీడితుల అభిప్రాయాలను విని, వారి ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా పని చేయాలి.
గందరగోళాలు ….. ప్రశ్నలు :
- పునరావాసం అనే పదానికి సరైన నిర్వచనం లేదు
- శరణాలయాలకు ఆవల పునరావాసం మరియు సమాజ స్రవంతిలో మళ్ళీ కలవటం తప్పకుండా జరిగేట్లు జాగ్రత్త వహించటం ఎలా?
- పీడితులు తమ ఇష్టానికి విరుద్దంగా శరణాలయంలో నిర్బంధించబడ్డారని అంచనా వేయటం ఎలా?
- శరణాలయాల్లో పీడితులు ఎంత కాలం ఉండాలనే అవధిని అధికారులు ఎలా నిర్ధారిస్తారు?
- నష్ట పరిహారాన్ని ఎలా గణిస్తారు?
- పీడితులకు సహకార సేవలు లభిస్తున్నదీ లేనిది, సమాజ స్రవంతిలో మళ్ళీ కలుస్తున్నదీ లేనిది ఎలా పర్యవేక్షించటం జరుగుతుంది?
- పీడితులు మానసిక వేధింపుకు గురికాకుండా నివారించవలసిన బాధ్యత కలిగినవారు ఎవరు?
- పీడితులు తమ కేసును పోరాడేందుకు మరియు చట్టపరమైన సేవలను పొందగలగటంలో సహకరించేందుకు ఒక న్యాయవాదిని కేటాయించే నిబంధన ` న్యాయవాది యొక్క ప్రభావ శీలతను మరియు వారు అందించే సేవల నాణ్యతను అంచనా వేయటం ఎలా?
- అంతర్ రాష్ట్ర దర్యాప్తులను నిర్వహించేందుకు మరియు ఇతర లాజిస్ఠిక్ పరమైన సహకారాన్ని సమకూర్చుకునేందుకు కావలసిన నిధులను సమకూర్చి పెట్టవలసిన బాధ్యత ఏ ప్రభుత్వానిది?
- దర్యాప్తులను నిర్వహించేందుకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) తో NIA ఎలా సమన్వయం జరుపుతుంది?
- ఎవరైనా విధి నిర్వాహకులు విధినిర్వహణలో నిర్లక్ష్యం చేస్తున్నారని లేదా వేధిస్తున్నారని మరియు మానసికంగా వేధిస్తున్నారని, లేదా పీడితుని పట్ల దుష్రృవర్తనకు పాల్పడుతున్నారని ఎవరైనా పీడితులు ఫిర్యాదులు చేసినప్పుడు సదరు ఫిర్యాదు గోప్యంగా ఉండేందుకు ఏమి చర్యలు తీసుకోబడతాయి?