My husband was pimping me to his friends to repay his debt’

నా భర్త… తన వ్యసనాలకు చేసిన అప్పులు బాకీ తీర్చడానికి నన్ను తన స్నేహితుల వద్దకు పంపేవాడు

“బబిత” మైనర్‌గా ఉండగానే తన భర్త ద్వార వ్యభిచారం లోకి బలవంతంగా దించబడింది, ఆమె ఆ వ్యభిచార కూపం నుంచి బయటపడేవరకు ఆమె గృహ హింస మరియు లైంగిక వేధింపులకు గురి అయింది. ఇప్పుడు ఆమె సెక్స్ వర్కర్స్ మరియు అక్రమ రవాణా భాదిత మహిళల పునరావాసం మరియు వారి సాధికారత కోసం పోరాటం చేయడం ప్రారంభించింది.

నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నకు గుండెపోటు వచ్చింది. మేము అతని చికిత్స కు సరిపడా ఆర్ధిక స్తోమత మాకు లేకపోవడం తో చాలా డబ్బు తీసుకోవలసి వచ్చింది, ఎక్కువ వడ్డీ రేటు కు మనీలెండర్ వద్ద అప్పు తీసుకోవడం జరిగింది. ఫలితంగా నా కుటుంబం అప్పుల్లో కూరుకుపోయింది. ఇదే సమయంలో తక్షణమే తన  రుణాన్ని తిరిగి చెల్లించాలని అప్పుల వాళ్ళు డిమాండ్ చేయడం ప్రారంభించారు. మాకు అధిక వద్దికి డబ్బులు ఇచ్చిన వ్యక్తీ తనను రికార్డు డాన్సర్ గా పనిచేస్తే నీ అప్పు సులభంగా తిరిగి చెల్లించవచ్చు అని బలవంత పెట్టి నన్ను రికార్డ్ డాన్సర్ గా మార్చి వేశాడు.  నాకు 16 ఏళ్ళు వయస్సు వచ్చిన తర్వాత ఈ వేదింపులు, కష్టాలు నుంచి తప్పించుకోవాలి అని అందుకు వీలుగా నేను వివాహం చేసుకోవడం ద్వారా ఈ భాదలు నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకొని నన్ను ప్రేమిస్తున్నాను అంటూ నా చుట్టూ తిరిగే ఒక వ్యక్తిని వివాహం చేసుకొన్నాను .

వివాహం అయిన మూడేళ్లలోనే నేను వివాహం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశానని గ్రహించాను. నా భర్త ఒక జూదరి, మద్యానికి బానిస, తాను తన వ్యసనాలకు చేసిన అప్పులు తిరిగి చెల్లించటానికి తనను డబ్బు సంపాదించమని ప్రతి రోజు నన్ను కొట్టడం, తిట్టడం చేసేవాడు. అతని అప్పులు వడ్డీలతో కలిసి ఒక సమయంలో రూ.10 లక్షల వరకు వెళ్ళింది. చివరకు ఓక రోజు తన స్నేహితుల వద్దకు నన్ను పంపి వాళ్ళతో వ్యభిచారం చేయడం ప్రారంభించాడు.  నాకు అప్పటికే ఇద్దరు పిల్లలు – ఒక అమ్మాయి మరియు అబ్బాయి. ఆ తరువాత కూడా శారీరక వేధింపు మరియు లైంగిక దోపిడీ కొనసాగింది.

నా భర్త వేదింపులు భరించ లేక చివరికి, నేను పారిపోయి హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నా తల్లి ఇంటికి తిరిగి వచ్చాను. నేను ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే నా తండ్రి అనారోగ్యం తో మరణించాడు, నా కుటుంబాన్ని పోషించడానికి మరో అవకాశం లేక తిరిగి రికార్డు డాన్సర్ గా ఈ వృత్తిలో తిరిగి ప్రవేశించాల్సి వచ్చింది.

నేను 2007 లో అక్రమ రవాణా భాదితులు మరియు వాణిజ్య లైంగిక దోపిడీ భాదితులు కోసం భాదితులే ఏర్పాటు చేసుకొన్న సమాక్య “విముక్తి” ఒక సబ్యురాలుగా చేరినప్పటి నుంచి నా జీవితం మారిపోయింధీ. ఈ విముక్తి ని హెల్ప్ అనే అక్రమ రవాణా నిరోధకం కోసం పనిచేసే సంస్థ మద్దతు ఉంది. నేను విముక్తి లో మెంబెర్ గా నా ప్రస్తవనం ప్రారంభించి నేడు నేను ఒక నాయకురాలు స్థాయి కి ఎదిగాను. ఆ నాటి నుంచి సెక్స్ ట్రాఫికింగ్ మరియు వ్యభిచారం నుండి బయటపడిన వారి హక్కుల కోసం పనిచేయడం ప్రారంభించాను.

సెక్స్ వర్కర్లుగా, మేము కళంకం, వివక్షతల తో బాధపడటమే కాదు, పేదరికం మరియు అప్పుల యొక్క విషవలయ  చక్రంలో చిక్కుకొంటున్నాము. ఇందుకు ప్రధానకారణం… మేము వేశ్యాగృహాల్లో నివసిస్తున్నందున మరియు మాకు అద్దె హక్కులు లేనందున మాకు బ్యాంక్ ఖాతాలు తెరుచుకొనే వీలు లేదు. ఎవరూ మాకు రుణాలు లేదా బీమా ఇవ్వరు ఫలితంగా మేము మాకు నెలకు 5 నుండి 12 శాతం అధిక వడ్డీ రేట్లు వసూలు చేసే స్థానిక రుణ సొరచేపలనే ఆశ్రయించ వలిసివస్తుంది.మా పిల్లలు పాఠశాల నుండి తప్పుకుంటారు… ఎందుకంటే వారు కళంకాన్ని, వివక్షతను, చిన్న చూపు   ఎదుర్కొంటా ఉన్నారు, నిరాశ మరియు మానసిక ఒత్తిడితో వారు బాధపడుతున్నారు మరియు వారు లైంగిక వేధింపులకు మరింత హాని కలిగించే మత్తు పదార్ధాలకు బానిసలు గా మారుతూ ఉన్నారు.

మేము అక్రమ రవాణా మరియు వాణిజ్య లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా ఈ సమాజంలో పోరాడుతూ ఉన్నాము. మా ఈ పోరాటంలో సెక్స్ వర్కర్లు మరియు వారి పిల్లల రక్షణ కోసం మేము ప్రచారం కూడా చేస్తూ ఉన్నాము. ఎవరూ తిరిగి వ్యభిచారంలోకి బలవంతంగా రాకుండా ఉండేందుకు మేము అక్రమ రవాణా భాదితులు మరియు సెక్స్ వర్కర్స్ కు సామాజిక మరియు ఆర్థిక భద్రత కల్పించడానికి కృషి చెస్తూ ఉన్నము  

నేను కూరగాయలను విక్రయించే చిన్న వ్యాపారాన్ని కూడా ప్రారంభించాను. నేను మరో పక్క “విముక్తి” లో రాష్ట్ర  కార్య నిర్వాహక సబ్యురాలుగా పనిచేస్తూ రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటాను.

విముక్తి సంస్థ రాష్ట్ర స్థాయిలో పనిచేస్తూనే జాతీయ స్థాయిలో అన్ని రకాల మనవ అక్రమ రవాణా భాదితులు తో ఏర్పాటు అయిన “ఇండియన్ లీడర్స్ ఫైటింగ్ అగనిస్ట్ ట్రాఫికింగ్” – ILFAT తో మేము చేతులు కలిపాము.  ఈ “ఇల్ఫాట్” ద్వార జాతీయ స్థాయిలో  అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాల కోసం పోరాటం చేస్తూ ఉన్నాము, అలాగే  భాదితుల రక్షణ, నష్ట పరిహారం చెల్లింపు, పునరావాసం కోసం, అలాగే భాదితులును సమాజంలోనే పునరావాసం కల్పించాలిని, వారిని సమాజం లో తిరిగి నిలబెట్టడానికి వీలుగా మెరుగైన సామాజిక విధానాల కోసం, మా పిల్లలకు రక్షణ, కల్పించి వారికీ సమాజంలో అందరి లాగా చదువుకొని ఉద్యోగ ఉపాది అవకాశాలు అందేలా చూడాలి అని మేము కేంద్ర ప్రబుత్వం తో పోరాటం చేస్తూ ఉన్నాము.

మెరుగైన పునరావాసం, బాధితుల నష్ట పరిహారం మరియు అక్రమ రవాణాదారులకు సమర్థవంతంగా శిక్షలు పడేలా ఉన్న చట్టాలు కటినంగా అమలు చేయడం కోసం మేము ప్రభుత్వంతో నిరంతరం సంప్రదిస్తూనే ఉన్నాము.

this story published in “Your Story.com” …

Read more in english at: https://yourstory.com/socialstory/2020/12/sex-trafficking-abuse-survivor

*Name changed to protect identity

(As told to Diya Koshy George)