మానవ అక్రమ రవాణా – అపోహలు మరియు వాస్తవాలు
మానవ అక్రమ రవాణా అంటే ?
మానవ అక్రమ రవాణా సంక్లిష్టమైనది మరియు ఏ పద్ధతిలో… ఎప్పుడు… ఎలా… ఎక్కడ… ఎవరు .. ఈ మనవ అక్రమరవాణా కు భాదితులు కానున్నారు అనే విషయం ఎవరికి అర్ధం కాకుండా ఉంటుంది. ఈ మానవ అక్రమ రవాణా నేడు దేశ వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతూనే ఉంది, కాని ఖచ్చితమైన సంఖ్యలు రావడం కష్టం. అయితే ఈ మనవ అక్రమ రవాణా బారిన పడి అందునుంచి విముక్తి కాబడుతున్న వారి సంఖ్య బట్టి మాత్రమే మనం అంచనాలు వేస్తున్నాము. అలాగే విముక్తి కాబడుతున్న భాదితుల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఏ ఏ పద్ధతిలో టాఫ్ఫికెర్స్ వారు అక్రమ రవాణా చేస్తున్నారో తెల్సుకొంతున్నాము … అయితే టాఫ్ఫికెర్స్ ఒక్కొక్కరిని ఒక్కో పద్ధతుల్లో అక్రమ రవాణా కొనసాగిస్తూ ఉన్నారు అని అర్ధం అవుతూఉంది. ప్రస్తుతం మనవ అక్రమ రవాణా గురించి చాలా తప్పుడు సమాచారం ప్రజల్లో ప్రచారం అవుతుంది. మానవ అక్రమ రవాణా గురించి సరైన సమాచారం తో పాటు అపోహలు మరియు వాస్తవాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము…….
అపోహలు మరియు వాస్తవాలు,
మానవ అక్రమ రవాణా వాస్తవాలు
ఎవరు ఈ అక్రమ రవాణా భారిన పడతారు ?
మానవ అక్రమరవాణా బారిన ఎవరైనా పడవచ్చు అయితే కొంతమంది మాత్రమే ఇతరుల కన్నా సులభంగా అక్రమరవాణా చేసే ట్రాఫికర్స్ వలల్లో చిక్కుకొంటారు. ముక్యంగా వలసలు వెళ్ళే వాళ్ళు, అలాగే ఉపాది కోసం కొత్త ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు, మత్తు పదార్థల వినియోగం, మానసిక ఆరోగ్య సమస్యలు, పిల్లల రక్షణ మరియు సంక్షేమ పరిరక్షించాలేని కుటుంబాల నుంచి పారిపోయిన లేదా నిరాశ్రయులైన యువత, విబేధాలు కారణంగా కుటుంబాలతో దూరంగా ఉంటున్న వారు, గృహ హింసకు తరచుగా గురయ్యే వారు ఇందులో ఉంటారు. అలాగే అక్రమ రవాణాదారులు (ట్రాఫికర్స్) కుడా పేదరికంతో పాటు వివిధ ఇబ్బందుల్లో, కష్టాల్లో, నిస్సహాయ స్థితి లో ఉన్న మహిళలు, బాలికలు ను గుర్తించి వారికీ సహాయం అందిస్తూ తమ పైనే వారు పూర్తిగా ఆధారపడేలా చేసి వారి నిస్సహాయత ను గుర్తించి వారిని వివిధ మార్గాల్లో, పద్దతుల్లో అక్రమరవాణాకు గురిచేస్తారు.
అక్రమ రవాణాదారులు (ట్రాఫికర్స్) ఎవరు?
మానవ అక్రమరవాణా చేసే ట్రాఫికర్స్ అన్ని జాతి,మతం మరియు లింగ భేదం లేకుండా అన్ని వర్గాల్లో ఉంటారు. చాలా కేసుల్లో వీరు స్వంత దగ్గిర బందువులు కూడా అయి ఉంటారు. కొందరు తమ పెద్దరికం, డబ్బు, అధికారం మరియు తమ శక్తిని సాధనంగా ఉపయోగిస్తు సామాజిక, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వారిని, వివిధ రకాల సమస్యల్లో ఉన్న వారిని వీరు ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ అక్రమ రవాణా చేసే ట్రాఫికర్స్ లలో వ్యక్తులు, వ్యాపార యజమానులు, ఒక ముఠా లేదా నెట్‌వర్క్ సభ్యులు, తల్లిదండ్రులు లేదా బాధితుల కుటుంబ సభ్యులు, సన్నిహిత భాగస్వాములు, భుస్వామ్యులు లేదా రెస్టారెంట్ల యజమానులు మరియు శక్తివంతమైన కార్పొరేట్ అధికారులు మరియు వివిధ రాజకీయ నాయకుల అనుచరులు కూడా ఉన్నారు.
అక్రమ రవాణాదారులు (ట్రాఫికర్స్) బాధితులను ఎలా తమ ఆదీనంలో ఉంచుకొంటారు ?
అక్రమ రవాణాదారులు వివిధ రకాల నియంత్రణ వ్యూహాలను ఉపయోగిస్తున్నారు, సర్వసాధారణం గా శారీరక మరియు మానసిక వేధింపులు, బెదిరింపులు లో లొంగ దీసుకోవడం, తర్వాత వారి స్నేహితులు, సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి వేరుచేయడం. అంతే గాక అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి అవి చేల్లెంచమని వత్తిడి చేసి ఆమెను తమ నియంత్రణ లోకి తీసుకొవడం. వారి యొక్క ఆర్ధిక లేదా ఇతర అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన వాగ్దానాలను కూడా వారు చేస్తారు. తత్ఫలితంగా, బాధితులు వీరి ఉచ్చులో చిక్కుకుపోతారు. ఒక్కసారి మహిళలు లేదా బాలికలు వీరి ఉచ్చు లో చిక్కుకొన్న తర్వాత ఇక బయటకు రావడానికి కూడా ఇష్టపడరు అందుకు కారణం సమాజంలో వీరిపై ఉన్న చిన్న చూపు, వివక్షత మరియు మానసిక గాయం, సిగ్గు, భావోద్వేగం, తమకు లేదా వారి కుటుంబసబ్యులుకు శారీరక బెదిరింపులతో సహా సమాజం ఆదరణ లేక పోవడం అలాగే ప్రభుత్వాల నుంచి తగిన రక్షణ కల్పిస్తారు అనే నమ్మకం లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల తమ గ్రామాలకు లేదా తమ కుటుంబ సబ్యుల వద్దకు వెళ్ళడానికి కూడా భయపడతారు.
మానవ అక్రమ రవాణా పై ఉన్న అపోహలు
అపోహ : ఇది ఎల్లప్పుడూ లేదా సాధారణంగా హింసాత్మక నేరం.
వాస్తవికత: మానవ అక్రమ రవాణా గురించి చాలా ప్రజల్లో ఉన్న ప్రచారం ఏమిటంటే, వ్యక్తులను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళడం లేదా శారీరకంగా హింస పెట్టి బలవంతం చేయడం ద్వార మానవ అక్రమ రవాణా జరుగుతుంది అని. వాస్తవానికి, చాలా మంది అక్రమ రవాణాదారులు (ట్రాఫికర్స్) వాణిజ్య లైంగిక దోపిడీ అంటే వ్యభిచారం కోసం లేదా శ్రమ దోపిడీ కోసం బాధితులను మోసగించడం, మోసం చేయడం, తారుమారు చేయడం లేదా బెదిరించడం వంటి పలు మార్గాలను ఉపయోగిస్తున్నారు.
అపోహ : ఒక్క వ్యభిచారం కోసమే మానవ అక్రమ రవాణా జరుగుతూ ఉన్నాయి
వాస్తవికత : మానవ అక్రమ రవాణా అంటే “ఒక వ్యక్తిని బలవంతంగా, లేదా తనకున్న శక్తి ద్వారా, లేదా మోసం లేదా ఒత్తిడి ద్వారా సేకరించి తర్వాత వాణిజ్య లైంగిక వ్యాపారం (వ్యభిచారం) కోసం లేదా శ్రామికులుగా, బానిసలు గా వినుయోగించు కోవడం కోసం వీరు అక్రమ రవాణా చేస్తూ ఉంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా, సెక్స్ ట్రాఫికింగ్ కోసం కంటే కార్మికులుగా వినుయోగించు కొనేందుకు మనుషులను అక్రమ రవాణా చేస్తున్నట్లు సామాజిక నిపుణులు భావిస్తున్నారు, అయితే కార్మిక అక్రమ రవాణా కంటే వాణిజ్య లైంగిక వ్యాపారం (వ్యభిచారం) కోసం మాత్రమే ఎక్కువ ప్రచారం జరుగుతూ ఉంది.
అపోహ: ట్రాఫికర్స్ తమకు తెలియని వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటారు.…
వాస్తవికత: అక్రమ రవాణా నుండి బయటపడిన చాలా మంది మహిళలు, బాలికలు పరిశీలిస్తే వారిని అక్రమ రవాణా చేసింది తమ భర్తలు, తమ శృంగార భాగస్వాములు, ప్రేమికులు,బాగా పరిచయం ఉన్న తమ ఇరుగుపొరుగు వారు, చాలా కేసుల్లో వారి స్వంత తల్లిదండ్రులతో సహా కుటుంబ సభ్యులు వీరిని అక్రమ రవాణా చేశారు.