వృద్ధాప్యం, కారణంగా కస్టమర్లు రాకపోవడం తో ఈ వేశ్యా వృతి నుంచి రిటైర్డ్ అయిన సెక్స్ వర్కర్లను కుడా ఆదుకొని వారికి సుప్రీంకోర్టు ప్రకటించిన రేషన్ అందించి రాష్ట్రంలో నివసిస్తున్న వికలాంగులు గా వున్న, జబ్బుపడిన 40 ఏళ్ళు దాటిన వృద్ధాప్య సెక్స్ వర్కర్లు ఆరోగ్య సంరక్షణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు, సుకవ్యాదులు, హెచ్ఐవి వ్యాదులు తో పాటు సమజంలో వారికి వున్న చిన్న చూపు వల్ల ఇప్పుడు వారు మరింత ఆందోళనలలో వున్నారని తక్షణమే వారిని ఆడుకోవడానికి ప్రత్యెక కార్యక్రమాలు చేప్పట్టి వారిని సహృదయంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి అని రాష్ట్ర స్థాయి సెక్స్ వర్కర్స్ వేదిక “విముక్తి” ఒక వినతి పత్రం ద్వార మహిళా శిశు సంక్షేమ శాక కార్యదర్శి ని, డైరెక్టర్ ను కోరడం జరిగింది.
విముక్తి తమ గ్రూప్ సబ్యులు ద్వార కృష్ణ, గుంటూరు మరియు ప్రకాశం జిల్లలో ఒక సర్వే చేసింది. ఈ సర్వే లో షుమారు ౩ వేల మంది పైగా సెక్స్ వర్కర్స్ 40 ఏళ్ళ వయస్సు పైబడి ఈ వృత్తికి దూరంగా వివిధ ఆరోగ్య సమస్యలు తో భాదపడుతూ ఒంటరి గా దుర్భర జీవితం గడుపుతూ వున్నారు. ప్రస్తుతం వృద్ధాప్య సెక్స్ వర్కర్లు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏమిటంటే, వృద్ధాప్యంలో ఉన్న ఈ మహిళలు సహజంగానే సంక్రమించని వ్యాధులకు గురవుతున్నారు ఈ “వృద్ధాప్య సెక్స్ వర్కర్స్ మనుగడ సాగించే మార్గం లేదు. కొందరు నగరం నుండి గ్రామాలకు తరలి వెళుతున్నారు ఆ తరువాత ఏమి జరుగుతుందో మాకు తెలియదు – వారు నిశ్శబ్దంగా చనిపోతారు” వీరి ఆరోగ్య పరిరక్షణ ఎవరు చేపట్టాలి అలాగే వీరికి సరైన ఆదరణ ఎవరు కల్పించాలి అనేది ఒక సమస్య గా మారింది అని “విముక్తి” రాష్ట్ర కార్యవర్గ సబ్యులు శ్రీమతి దుర్గ, భాను ప్రియ, శ్రీమతి మున్ని, శ్రీమతి రజని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నేడు రాష్ట్రం లో షుమారు ఒక లక్ష మంది సెక్స్ వర్కర్స్ వున్నట్లు ఇటీవల రాష్ట్ర ఎయిడ్స్ కొంట్రోల్ శాఖ ఒక సమాచార హక్కు చట్టం క్రింద ఇచ్చిన సమాదానం లో తెలియజేసింది. కాని సెక్స్ వర్కర్స్ తో పనిచేస్తున్న కమునిట్టి సంస్థల లెక్కల ప్రకారం ఈ సెక్స్ వర్కర్స్ సంక్య మరో 60 వేలు ఎక్కువగా ఉండవచు అని అంచనా. వీరిలో చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు మరియు ఆదాయ వనరులు మిగిలి లేవు. కొందరు వీధుల్లో యాచించవలసి వస్తుంది. వీరిలో 40 ఏళ్ళు పైబడిన వారిలో 45% సెక్స్ వర్కర్స్ ను జాగ్రత్తగా చూసుకోవడానికి తమ స్వంత వాళ్ళు అనేవారు ఎవరూ లేరు. 45 ఏళ్ల సెక్స్ వర్కర్ రాణి, ఏకైక సంతానం కూడా ఇప్పుడు ఈ వేశ్యా వృత్హి లోనే ఉంది, “నా పొదుపులు మొత్తం కలిపి ఇప్పుడు నా వద్ద 12,000 కన్నా తక్కువ గా వున్నాయి. నా కుమార్తె మరొక ప్రాంతం లోని వేశ్యాగృహం లో పనిచేస్తున్నందున నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి నా దగ్గర ఎవరూ లేరు. నేను ఇప్పుడు సెక్స్ పనికి రాను… నా వయస్సు, నా ఆరోగ్యం సహకరించదు, నేను ఇప్పుడు ఏ పనిచేయడానికి అయినా సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఎవరూ నాకు ఏ పని ఇవ్వడం లేదు” అని రాణి చాల ఆవేదన వ్యక్తం చేస్తుంది.
విముక్తి నిర్వహించిన ఈ సర్వే లో వృద్ధాప్య సెక్స్ వర్కర్స్ చాలా మంది రెగ్యులర్ ఫిజికల్ థెరపీ అవసరమయ్యే ఆర్థరైటిక్ నొప్పి రకం, దీనికి చికిస్థ చేయడానికి చాలా ఖరీదైనది అంతే గాక సెక్స్ వర్కర్లకు బీమా లేదు. చాలా మంది వృద్ధాప్య సెక్స్ వర్కర్లలో కూడా అధిక రక్తంలో చక్కెర ఉంది, ఇది డయాబెటిస్‌గా అభివృద్ధి చెందుతుంది. “డయాబెటిస్ ఉన్నవారికి మందులు క్రమం తప్పకుండా వాడటం చాలా అవసరం. వీరిలో 10% మంది కంటి సమస్యలతో భాదపడుతూ వున్నారు వీరికి కంటిశుక్లం ఆపరేషన్లకు చేయించి కంటి అద్దాలు సరఫరా చేసే వాళ్ళు లేకపోవడం తో వీరు చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు. వృద్ధాప్య జనాభాలో శ్వాసకోశ అంటువ్యాధులు కూడా పెరుగుతున్నాయి-ఉపరితిత్తుల సామర్థ్యం క్రమం తప్పకుండా 50 తర్వాత బలహీనపడుతుంది వీరుఎకువ మంది మురికి వీధులు పక్కన వుండే కాలనీలు లో నివాసం అందువల్ల సులభంగా వీరు తరచూ అంటువ్యాధులకు గురవుతున్నారు. “ఈ నిరాశ్రయులైన వృద్ధాప్య సెక్స్ వర్కర్లకు ప్రభుత్వం ఆశ్రయం కల్పించగలిగితే వారి జీవితాలు బాగుపడుతాయి” అని “విముక్తి ” సంస్థ నాయకులు శ్రీమతి దుర్గ చెప్పింది.
సెక్స్ వర్కర్ల హక్కుల కోసం పనిచేసే “విముక్తి ” సంస్థ నాయకులు శ్రీమతి దుర్గ, భాను ప్రియ, శ్రీమతి మున్ని, శ్రీమతి రజని మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మీద షుమారు 15 నుంచి 20 వేల మంది సెక్స్ వర్కర్స్ వృద్ధాప్యం, కారణంగా కస్టమర్లు రాకపోవడం, అలాగే వివిధ వ్యాదులు తో భాదపడుతూ ఈ వేశ్యా వృతి నుంచి రిటైర్డ్ అయిన సెక్స్ వర్కర్లను ఆదుకోవడానికి ప్రతేకంగా ఒక పునరావాస కార్యక్రమం రూపొందించాలని వివిధ డిమాండ్స్ తో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక వినతి పత్రం ద్వార కోరారు.
- వీరికి ప్రభుత్వ హాస్టల్, అంగన్వాడి సెంటర్స్ లో మరియు వివిధ ప్రభుత్వ నిర్వహణలోని అతిధి గృహలల్లో వీరికి బేబీ సిటర్లు, ఆయాలు గా, పనిమనిషి, వంటవారు గా నియమించ వలిసినడిగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ·
- రాష్ట్రం లో వివిధ రకాల భాదిత మహిళల పునరావాసం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, 2 0 0 3 లో సెక్స్ వర్కర్స్ పునరావాసం కోసం రూపొందించిన జి వో నెంబర్ :1/2003 తక్షణం అమలులోకి తీసుకొని రావాలి. అందుకోసం ప్రత్యకంగా ప్రతి జిల్లా స్థాయిల్లో ప్రత్యక కమిటి లను ఏర్పాటు చేయాలి.
- జి వో నెంబర్ 1 / 2 00 3 ప్రకారం 35 ఏళ్ళు పైబడిన సెక్స్ వర్కర్స్ కు వ్రుద్యాప్య పెన్షన్ సదుపాయం కల్పిస్తూ.. వీరికి ప్రత్యేకంగా నివసించడానికి వీలుగా గృహ వసతి కల్పించాలి ·
- వారికి ఉచిత వైద్య సదుపాయాలు, ఆరోగ్య కార్డులు మరియు రేషన్ ఉచితంగా అందించాలి.·
- వృద్ధాప్య సెక్స్ వర్కర్స్ రక్షణ మరియు సంక్షేమం కోసం పునరావాసం కల్పించే ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి